Monday, 31 January 2022

శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి అలయ చరిత్ర - UTTANOORU VILLAGE

 



                    శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి అలయ చరిత్ర


                                                అత్యత్భుతం.... ఈ ఆలయం....




      అష్ట ఐశ్వర్యాలు... ఆయురారోగ్యాలు ప్రసాదించే కలియుగ వైకుంఠ దైవం


అర్జునుడి మునిమనవడు, ప్రతీక్ రాజా తనయుడు... శ్రీ జనమేజయ మహారాజు గారిచే ప్రతిష్టింపబడి... గణపతి అంశ శంభూతులు శ్రీశ్రీశ్రీ గోపాల దాసుల వారి సంకీర్తనలతో పరమపావనమైన ఆలయం.

సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడే గోపాల దాసుల వారి కీర్తనలకు పరవశించి... నాట్యం ఆడిన ప్రాంతం ఈ ఆలయం...


ఆలయ చరిత్ర గురించి మరిన్ని వివరాలకు ఆ వీడియో లో వీక్షించాలని మనసారా కోరుతున్నాం


                ---           శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం          ---

                   ఉత్తనూరు గ్రామం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా

                       Uttanooru - A Village with Cultural and Constitutional Values


fb link : https://fb.watch/aRFxGGDZxS/

Tuesday, 25 January 2022

శ్రీ గోపాల విఠల ప్రసన్న ఆగతాది త్రికాలజ్ఞ ఆగమార్థ విశారదం త్యాగ బోగ సమాయుక్తం భాగణార్యం గురుభజే -- శ్రీ గోపాల దాసులవారి చరిత్ర


 

శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

 ఓం నమో వేంకటేశాయ....

వచ్చే నెల ఫిబ్రవరి 03వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా, అట్టహాసంగా ప్రారంభం అవుతున్న శ్రీశ్రీ శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు





• ఫిబ్రవరి 03న, శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం
• ఫిబ్రవరి 04న ప్రభోత్సవం
• ఫిబ్రవరి 05న, రథోత్సవం


ఫిబ్రవరి 05 నుండి ఫిబ్రవరి 09 : బాస్కెట్‌బాల్ టోర్నమెంట్

ఉదయం వేళలు : 6 గంటల నుండి 9.00 వరకు
సాయంత్రం వేళలు: 5 గంటల నుండి 9.00 వరకు ( ఫ్లడ్‌లైట్ల కింద)




ఫిబ్రవరి 03 నుండి ఫిబ్రవరి 07 వరకు... సాంస్కృతిక కార్యక్రమాలు



ఫిబ్రవరి 5 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్న ఒంగోలు జాతి వృషభ రాజముల బలప్రదర్శన








-- Note ---
• దయచేసి కరోనా జాగ్రత్తలు సరిగ్గా పాటించండి
• దయచేసి మాస్క్‌లను సరిగ్గా ధరించండి
• సామాజిక దూరం పాటించండి
ఇట్లు....
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం,
ఉత్తనూరు గ్రామం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా

Friday, 14 January 2022

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం, శ్రీవారు ఉత్తరద్వారం

 వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తనూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయానికి తరిలివచ్చిన భక్తులు... ఈ పర్వదిన సందర్భంగా శ్రీవారు ఉత్తరద్వారం గుండ భక్తులకు దర్శనమిచ్చారు......

ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది...
ఆలయ చైర్మన్, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పులకుర్తి తిరుమల్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన కల్యాణంలో వ్యాపార కొత్తకోట జయన్న దంపతులు ఉత్సవమూర్తి కి తొడుగ కూర్చోగా గోవిందనామస్మరణల మధ్య కనులపండువగా కల్యాణం జరిగింది.
















Tuesday, 11 January 2022

అందరు ఆహ్వానితులే....

 అందరు ఆహ్వానితులే....

వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం... ( జనవరి, 13 -- ఉదయం 4.30 గంటలకు )
శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం...
(మధ్యాహ్నం 12.30 గంటలకు) ...
భజన కార్యక్రమము ( రాత్రి 10.00 గంటలకు )
Note :
1. దయచేసి మాస్క్‌లను సరిగ్గా ధరించండి
2. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి
3. దయచేసి సామాజిక దూరం పాటించండి
4. శానిటైజర్ ఉపయోగించండి
5. క్యూ లైన్ లో జాగ్రతలు పటించండి


Friday, 7 January 2022

ఉత్తర ద్వార దర్శనం & శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం - LIVE TELECAST

కరోనావైరస్ ప్రభావం వల్ల శ్రీవారి కళ్యాణ మహోత్సవం చూడలేని వారికోసం సోషల్ మీడియా లో లైవ్ టెలికాస్ట్ చేయలని దేవస్థాన కమిటీ నిర్ణయం తిసుకుంది



                           

                                           CLICK ON THE BELOW LINK :
                                              ( దిగువ లింక్‌పై క్లిక్ చేయండి )

                         https://www.facebook.com/events/496690172106227/

Wednesday, 5 January 2022

ఉత్తర ద్వార దర్శన మహత్యం


 ఉత్తర ద్వార దర్శన భాగ్యం -- సకల పాప హరణం

ఉత్తర ద్వార, వైకుంఠ ఏకాదశి వైభవం:


కృతయుగం మురాసురుడు అనే రాక్షసుడు, మానవులను, దేవతలను సర్వవిధబాధలను పెడుతున్న సమయంలో దేవతలంతా కలసి శ్రీమన్నారాయణుని ప్రార్థించగా ఆయన ఒక సంకల్పబలంతో జపం చేయుచుండగా వివిధ వర్ణాలతో కూడిన ఏకాదశి శక్తులతో ఒక అమ్మవారి రూపం ఉద్భవించి రాక్షసుడైన మురాసురుడుని సంహరించి అందరినీ రక్షిస్తుంది. కనుక అప్పటి నుండి ఆమెకు ఇచ్చిన వరప్రసాదం చేత ప్రతి ఏకాదశినాడు ఉపవాస దీక్షలతో మిమ్ములను (శ్రీవారిని పూజిస్తే, సర్వశుభాలు చేకూరతాయి అని సెలవిచ్చిందట. ఆనాటి నుంచి దేవతలంత సంతోషించి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర వైకుంఠ ద్వారం గుండా సమస్త 33 కోట్ల దేవతలందరు దర్శిస్తారని పురాణం


Sunday, 2 January 2022

ఓం నమో వేంకటేశాయ....

ఓం నమో వేంకటేశాయ.....
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి గురువారం తేది 13-01-2022వ తేదిన తెల్లవారు జామున గం|| 4-30 ని॥లకు బ్రాహ్మీముహుర్తమున వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా ఉత్తనూరు క్షేత్రము నందు అర్జునుని ముని మనువడైన శ్రీ జనమేజయ మహారాజు చేత ప్రతిష్ఠితమై, శ్రీ మహాగణపతి అంశ సంభూతులైన శ్రీ గోపాల దాసుల వారు అమృత తుల్యమైన సంకీర్తనల చేత శ్రీవారిని స్తుతించి, సేవించబడి దేవతలందరికి అమరత్వాన్ని ప్రసాదించిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరీ వేంకటరమణుని దివ్య ఆలయ సన్నిధిలో దక్షిణాయన పుణ్యకాలంలో సర్వశుభాలను చేకూర్చే ముక్కోటి దేవతలతో కలిసి మనం కూడా వైకుంఠనాధుడి దివ్య సుందర స్వరూపాన్ని దర్శించేందుకు ఉత్తర వైకుంఠ ద్వార ప్రవేశానికి శ్రీవారి దివ్యాశీస్సులతో దైవజ్ఞులైన భాగవతోత్తముల చేత దివ్యమైన సుముహూర్తం నిర్ణయించడం జరిగినది.

ఉత్తర వైకుంఠ ద్వార ప్రవేశం

తేది. 13-01-2022
తెల్లవారుజామున 4.30 నిమిషాలకు
తెల్లవారు జామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఉత్తరద్వార పూజ, కూష్మాణ్ణబలి, కవాటోద్ఘాటనం, ప్రవేశం బిందే సేవ పంచామృత అభిషేకం, వస్త్ర సమర్పణ, పుష్పాలంకార సేవ, సేవాకాలం, ఆలయ బలిహరణ విశ్వరూపం సందర్శన నివేదన తీర్థ ప్రసాతవితరణ

12-00 గంటల కు

శ్రీ వారి కళ్యాణం

రాత్రి 10.00 గంటలకు

ఆరాధన సేవాకాలం, బలిహరణ నివేదన మహా మంగళహారతి, కవాట బంధనం