Srisrisri Sridevi Bhudevi Sametha Dhanvanthari Venkateshwaraswamy Temple - Uttanooru
Saturday, 16 December 2023
Vaikuntha Ekadashi - 2023
Friday, 6 January 2023
వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశి శుభసందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలోని
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి వేడుకలు
• అర్జునుడి మునిమనవడు జనమే జయమహారాజు గారిచే ప్రతిష్టింపబడిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వరుడిని ఉత్తరద్వారం గుండ దర్శించెందుకు పోటెత్తిన భకజనులు
• అంగరంగ వైభవంగా... కమనీయంగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ వైభోగం
• కల్యాణం అనంతరం ఘనంగా సాగిన స్వామి వారి రథోత్సవం
• దర్శించుకున్న 25వేల పైచీలుకు భక్తాదులుశ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం (06.01.2023 )
శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం
అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో మూల విగ్రహానికి, ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించి కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
- శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఉత్తనూరు
Sunday, 1 January 2023
Tuesday, 20 December 2022
🕉️......ఆహ్వానం......🕉️
Wednesday, 7 December 2022
దత్తాత్రేయ జయంతి
దత్తాత్రేయ నామ విశిష్టత
దత్తాత్రేయడ్ని బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది.
ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ కూడా పిలుస్తుంటారు. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా భావిస్తుంటారు.
వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకున్న దత్తాత్రేయుడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ ఆధ్యాత్మిక చింతనలో గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు.
1. దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం
నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి, తమకు భోజనం పెట్టమని అడిగారు.ఆమె అందుకు అంగీకరించగానే, ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది.అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు. కోరిన విధంగా భోజనం వడ్డించింది.
ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా, ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు, ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది.
తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయనుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో పుత్రునిగా జన్మించమని అడిగింది.ఆ విధంగా ఆ మహా పతివ్రత దత్తునికి తల్లి అయ్యింది.
#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam
#dhanvantarivenkateshwara #ఉత్తనూరు #uttanuru #uttanooru
#dattaguru #dattatreya #DattaJayanti #Datta #gurudatta #vishnu #Srihari #omnamonarayanaya #omnamovenkateshaya #omnamahshivaya #Trimurti #kaliyuga
Tuesday, 29 November 2022
సుప్రభాతసేవ - నిజరూప దర్శనం
Saturday, 26 November 2022
సుప్రభాత సేవ
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥
తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥
Monday, 21 November 2022
స్వామి వారి పల్లకీ సేవ
ఉత్తనూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ధన్వంతరి జయంతి సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam
నేడు ఉత్తనూరులో ధన్వంతరి వెంకటేశ్వరస్వామి జయంతి
Tuesday, 8 November 2022
కార్తీక పౌర్ణమి శుభకాంక్షలు
కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
పురాణ కథ
ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమే పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
కల్యాణం మహోత్సవం - 08 Nov, 2022
కల్యాణం కమనీయం..
కనులపండువగా శ్రీవారి కల్యాణోత్సవం
• పౌర్ణమి సందర్బంగా ఉత్తనూరు గ్రామం లోని శ్రీశ్రీశ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు...
• ధన్వంతరి వేంకటేశ్వరుడి కల్యాణం తిలకించి తన్మయులైన భక్తజనం
స్వామి వారికి పాదప్రక్షాళన, జంధ్యధారణ, జీలకర్ర బెల్లం, తతంగాలను వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం అనంతరo మాడ వీధుల్లో స్వామి వారి మూలవిరాట్ ని రథంలో ఊరేగించడం జరిగింది. శ్రీవారి సేవలో పాల్గొన్న సకలకోటి భక్తజనం.
స్వామి వారి కల్యాణ మహోత్సవం అనంతరం ఈరోజు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయడం జరిగింది. రేపు ఉదయం ఆలయ సంప్రోక్షణం అనంతరం తెరవడం జరుగుతుంది.
#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam
#sridevibhudevisamethasrivenkateswaraswamy #sreevarikalyanam #uttanooru #omnamovenkateshaya #GovindaGovinda #TTD #karthikpurnima #purnima #KarthikaMasam
Tuesday, 25 October 2022
గోవర్ధనగిరి పూజ శుభకాంక్షలు
సకలకోటి భక్తాదులకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పూజ శుభకాంక్షలు
చరిత్ర:
ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను ‘ఇంద్రయాగం’ అనేవారు.ఇదా పేరుకు ‘ఇంద్రయాగం’ కానీ ఏ విధమైన యాగాలు నిర్వహించరు. ఇంద్రుని షోడశోపచాలతో పూజించి నివేదనలు సమర్పిస్తారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పుదిక్పాలుడు. వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ పండుగనాడు ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పిస్తారు. అందుకే ఈపూజకు ‘అన్నకూటం’ అని మరొక పేరుకూడా ఉంది.
ఈ పూజ వెనుక కథ :
శ్రీకృష్ణుడు..శ్రీమహావిష్ణువు అవతారమని ఇంద్రునకు తెలిసినా., మానవుడుగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని భావించాడు ఇంద్రుడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు, ఇంద్రుని గర్వం అణచాలని సంకల్పించాడు. ఎప్పటిలాగే ‘ఇంద్రయాగం’ చేసేరోజు రానే వచ్చింది. గోకులంలోని వారంతా ఇంద్రుని పూజించడానికి సర్వం సిద్ధం చేసారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి, గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ ‘ఈ రోజు నుంచి ఇంద్రుని పూజించడం మానేయండి. మనందకీ పంటలు., మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే. కనుక నేటినుంచి ఈ పర్వతాన్నే పూజిద్దాం’ అన్నాడు. గోకులంలో వారందరకూ శ్రీకృష్ణుని మాటంటే వేదం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో, ఎందరో రాక్షసుల బారి నుంచి గోకులవాసులను కాపాడాడు. అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుని మాట గౌరవించి ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి.. గోకులంమీద రాళ్ళతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. గోకుల వాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు.
శ్రీకృష్ణుడు వెంటనే గోవర్ధన పర్వతాన్ని తన చిటికెనవ్రేలు మీద ఎత్తి, గొడుగులా పట్టుకుని తనవారినందరినీ గోవర్ధన పర్వతం క్రిందకు రమ్మన్నాడు. అందరూ గోవర్ధన పర్వతం క్రిందకు చేరారు. ఇంద్రుడు అలా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు రాళ్ళవాన కురిపిస్తూనే ఉన్నాడు. అప్పటికి ఇంద్రుని గర్వం నశించి, అతనే స్వయంగా శ్రీకృష్ణునిదగ్గరకు వచ్చి శరణు కోరాడు. శ్రీకృష్ణుడు ఇంద్రని క్షమించాడు. నాటి నుండి ‘ఇంద్రయాగం’ ‘గోవర్ధనపూజ’గా మారిపోయింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్న రోజు ‘కార్తీక శుద్ధ పాడ్యమి’. అందుకనే ఈ రోజున రైతాంగమంతా ఈ గోవర్ధన పూజను నిర్వహిస్తారు. ఈ రోజున ఉదయమే తలస్నానం చేసి, ఆవుపేడతో శ్రీకృష్ణుని విగ్రహాన్ని తయారుచేసి, షోడశోపచారాలతో శ్రీకృష్ణుని ఆరాధించి., అన్నపు రాశులు, రకరకాల పిండివంటలు, పదార్ధాలు శ్రీకృష్ణునకు నివేదనగా సమర్పిస్తారు. తర్వాత ఆట పాటలతో శ్రీకృష్ణుని సంతోషపరచి ఆ ప్రసాదాన్ని సామూహికంగా భుజిస్తారు. ఇదీ ‘గోవర్ధన పూజ’ కథ.
#GovardhanPuja #srikrishna #lordkrishna #radhakrishna #krishnatrance #Karthikeya2 #ఉత్తనూర్ #uttanooru #pulakurthithirumalreddy
#uttanoorudhanvantarivenkateshwaraswamytemple
#Svbc #mahavishnu #vishnuavatar
Monday, 24 October 2022
దీపావళి పండగ శుభకాంక్షలు
భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఉన్న ప్రాశస్య్తం ఎక్కువ. దీపావళి పుట్టుక వెనుక ఎన్నోకథలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. నరకాసురుడిని చంపినందుకు ప్రజలు ఆనందంగా చేసుకునే పండుగగా భాగవతం చెబుతుంటే, అలాగే రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన కారణంగా అయోధ్య ప్రజలు ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకున్నట్టు రామాయణం చెబుతోంది. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. ఈ పండుగ ముందు రోజు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఈరోజు కోసం ఏడాదంతా ఎదురుచూసే వారు ఎంతోమంది. దీపావళి రోజున లక్ష్మీపూజ చేస్తే ధనధాన్యాలు లభిస్తాయని అందరి నమ్మకం.
శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున సకల కోటీ భక్తాదులకు దీపావళి పండుగ శుభకాంక్షలు
#PulakurthiThirumalReddy
#HappyDiwali #happydiwali2022
#uttanoorudhanvantarivenkateshwaraswamytemple
Monday, 10 October 2022
-
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవి...
-
నేడు ఉత్తనూరులో ధన్వంతరి వెంకటేశ్వరస్వామి జయంతి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో గల అర్జునుడి మనవడు జనమేజయు...
-
కల్యాణం కమనీయం.. కనులపండువగా శ్రీవారి కల్యాణోత్సవం • పౌర్ణమి సందర్బంగా ఉత్తనూరు గ్రామం లోని శ్రీశ్రీశ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వా...