ఓం నమో వేంకటేశాయ.....
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి గురువారం తేది 13-01-2022వ తేదిన తెల్లవారు జామున గం|| 4-30 ని॥లకు బ్రాహ్మీముహుర్తమున వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా ఉత్తనూరు క్షేత్రము నందు అర్జునుని ముని మనువడైన శ్రీ జనమేజయ మహారాజు చేత ప్రతిష్ఠితమై, శ్రీ మహాగణపతి అంశ సంభూతులైన శ్రీ గోపాల దాసుల వారు అమృత తుల్యమైన సంకీర్తనల చేత శ్రీవారిని స్తుతించి, సేవించబడి దేవతలందరికి అమరత్వాన్ని ప్రసాదించిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరీ వేంకటరమణుని దివ్య ఆలయ సన్నిధిలో దక్షిణాయన పుణ్యకాలంలో సర్వశుభాలను చేకూర్చే ముక్కోటి దేవతలతో కలిసి మనం కూడా వైకుంఠనాధుడి దివ్య సుందర స్వరూపాన్ని దర్శించేందుకు ఉత్తర వైకుంఠ ద్వార ప్రవేశానికి శ్రీవారి దివ్యాశీస్సులతో దైవజ్ఞులైన భాగవతోత్తముల చేత దివ్యమైన సుముహూర్తం నిర్ణయించడం జరిగినది.
No comments:
Post a Comment