Tuesday, 29 November 2022
సుప్రభాతసేవ - నిజరూప దర్శనం
Saturday, 26 November 2022
సుప్రభాత సేవ
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥
మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥
తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥
Monday, 21 November 2022
స్వామి వారి పల్లకీ సేవ
ఉత్తనూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ధన్వంతరి జయంతి సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.
#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam
నేడు ఉత్తనూరులో ధన్వంతరి వెంకటేశ్వరస్వామి జయంతి
Tuesday, 8 November 2022
కార్తీక పౌర్ణమి శుభకాంక్షలు
కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో 'ప్రాశస్త్యం' కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
పురాణ కథ
ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమే పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
కల్యాణం మహోత్సవం - 08 Nov, 2022
కల్యాణం కమనీయం..
కనులపండువగా శ్రీవారి కల్యాణోత్సవం
• పౌర్ణమి సందర్బంగా ఉత్తనూరు గ్రామం లోని శ్రీశ్రీశ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు...
• ధన్వంతరి వేంకటేశ్వరుడి కల్యాణం తిలకించి తన్మయులైన భక్తజనం
స్వామి వారికి పాదప్రక్షాళన, జంధ్యధారణ, జీలకర్ర బెల్లం, తతంగాలను వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం అనంతరo మాడ వీధుల్లో స్వామి వారి మూలవిరాట్ ని రథంలో ఊరేగించడం జరిగింది. శ్రీవారి సేవలో పాల్గొన్న సకలకోటి భక్తజనం.
స్వామి వారి కల్యాణ మహోత్సవం అనంతరం ఈరోజు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయడం జరిగింది. రేపు ఉదయం ఆలయ సంప్రోక్షణం అనంతరం తెరవడం జరుగుతుంది.
#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam
#sridevibhudevisamethasrivenkateswaraswamy #sreevarikalyanam #uttanooru #omnamovenkateshaya #GovindaGovinda #TTD #karthikpurnima #purnima #KarthikaMasam
-
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవి...
-
నేడు ఉత్తనూరులో ధన్వంతరి వెంకటేశ్వరస్వామి జయంతి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో గల అర్జునుడి మనవడు జనమేజయు...
-
కల్యాణం కమనీయం.. కనులపండువగా శ్రీవారి కల్యాణోత్సవం • పౌర్ణమి సందర్బంగా ఉత్తనూరు గ్రామం లోని శ్రీశ్రీశ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వా...