Tuesday, 20 December 2022

🕉️......ఆహ్వానం......🕉️

 

🕉️......ఆహ్వానం......🕉️
        స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం అనగా 02-01-2023 వ తేదీన తెల్లవారు జామున 04.30 ని॥లకు బ్రాహ్మ ముహూర్తమున వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా ఉత్తనూరు క్షేత్రము నందు ఉత్తర ద్వార దర్శన భాగ్యము, శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం జరుగును

''వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ''.... అంటే ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర  ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. ఏడాదిలో ఉండే 12 నెలల్లో 11 వది పుష్యమాసం . ఈ  మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి,  ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి మోక్షదాయకమే అని వేదవాక్కు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా.... 
ఉత్తర వైకుంఠ ద్వార ప్రవేశం మరియు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఉత్తరద్వార పూజ, కూష్మాణ్ణబలి, కవాటోద్ఘాటనం, ప్రవేశం బిందే సేవ పంచామృత అభిషేకం, వస్త్ర సమర్పణ, పుష్పాలంకార సేవ, సేవాకాలం, ఆలయ బలిహరణ విశ్వరూపం సందర్శన నివేదన తీర్థ ప్రసాద వితరణ

• మధ్యాహ్నం 12-00 గం॥లకు శ్రీమతి & శ్రీ గోగుల ప్రకాష్ రెడ్డి, శిరీష దంపతులచే శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ దేవస్థాన కమిటీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.... 

• రాత్రి 10.00 గంటలకు మంగళ హారతి సమర్పించి ఉత్తర ద్వార బంధనం వేయడం జరుగుతుంది

అందరూ ఆహ్వానితులే... 🕉️

ఓం నమో వేంకటేశాయ ... ఓం నమో శ్రీనివాసాయ... ఓం నమో ధన్వంతరీ వేంకటేశ్వరాయ నమః


Wednesday, 7 December 2022

దత్తాత్రేయ జయంతి


 దత్తాత్రేయ నామ విశిష్టత


దత్తాత్రేయడ్ని బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది.

ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ కూడా పిలుస్తుంటారు. ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా భావిస్తుంటారు.

వైష్ణవ పూజావిధానాలను పుణికి పుచ్చుకున్న దత్తాత్రేయుడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, భారతీయ ఆధ్యాత్మిక చింతనలో గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు.


1. దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం

నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి, తమకు భోజనం పెట్టమని అడిగారు.ఆమె అందుకు అంగీకరించగానే, ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిధులను అగౌరవపర్చినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది.అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను "భవతీ బిక్షాం దేహి" అని కోరుతూ ఆమెను తల్లీ అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు. కోరిన విధంగా భోజనం వడ్డించింది.

ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా, ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్లు చిన్న పిల్లలుగా మారిపోయారు, ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది.

తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగివచ్చి జరిగిన కథను అనసూయనుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో పుత్రునిగా జన్మించమని అడిగింది.ఆ విధంగా ఆ మహా పతివ్రత దత్తునికి తల్లి అయ్యింది.


#uttanoorudhanvantarivenkateshwaraswamyvaaridevasthanam 

#dhanvantarivenkateshwara #ఉత్తనూరు #uttanuru #uttanooru 

#dattaguru #dattatreya #DattaJayanti #Datta #gurudatta #vishnu #Srihari #omnamonarayanaya #omnamovenkateshaya #omnamahshivaya #Trimurti #kaliyuga