Friday, 4 February 2022

శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

 




శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

పచ్చని తోరణాలు. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి కల్యాణం కమణీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రామంలో కొలువైన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ( ఫిబ్రవరి 04) తెల్లవారుజామున 12.45 గంటలకు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవిలకు మాంగళ్యధారణ చేశారు.

అంతకుముందు వేద పండితులు కల్యాణ తంతును వైభవంగా నిర్వహించారు. కల్యాణం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. ఎప్పుడు లేని విధంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. పులకుర్తి మనీష్రెడ్డి, సుప్రజ దంపతులు శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామిలకు తోడు కూర్చోగా వేద పండితులు కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కల్యాణం జరుగుతున్నంత సేపు భక్తులు కనులారా తిలకించారు. అనంతరం దేవస్థాన కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసింది. ఈ కార్యక్రమంలో ,దేవస్థాన కమిటీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పులకుర్తి తిరుమల్ రెడ్డి గారు, వ్యాపారవేత్త పులకుర్తి శ్రీనాథ్ రెడ్డి గారు, దేవస్థాన కమిటీ సభ్యులు, భక్తులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment