Tuesday, 8 February 2022

అంగరంగ వైభవంగా... రమణీయంగా ధన్వంతరి వేంకటేశ్వరుడి రథోత్సవం..

 అంగరంగ వైభవంగా... రమణీయంగా ధన్వంతరి వేంకటేశ్వరుడి రథోత్సవం..

భక్తుల గోవిందనామస్మరణల మధ్య, మంగళ వాాయిధ్యాల నడుమ... శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం రమణీయంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు భాగములో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పులకుర్తి తిరుమల్ రెడ్డి గారి అధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.











అట్టహాసంగా బాస్కెట్‌బాల్ టోర్నమెంట్...



ఉత్తనూరు గ్రామం లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం లో అంతర్ రాష్ట్ర బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పోటి అట్టహాసంగా జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 30 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు లీగ్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి.

హోరాహోరీగా ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శనలు....





శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వస్తున్నా అంతర్ రాష్ట్రీయ పశు బల పోటి అట్టహాసంగా జరిగింది. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు నాలుగు పల్ల విభాగంలో మొత్తమ్ 33 జతలు పాల్గొన్నాయి. ఆరు పల్ల విభాగంలో కూడా పోటీలు అంగరంగ వైభవంగా... హోరింతల మధ్య ప్రారంభం అయ్యాయి.

అఖండ సినిమా ఎద్దులు ప్రత్యేక ఆకర్షణ:



అఖండ సినిమాలో బాలయ్య బాబు తో పాటు ఉన్న ఎద్దులు... ఉత్తనూరు శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలచాయి. ఈ ఎద్దులు థో పాతు వివిధ వర్గం లో వృషభ రాజముల ప్రదర్శన తిలకించడనికి చుట్టు పక్కన గ్రామలతో పాటు...పక్క రాష్ట్రాల నుండి కూడా భారీగా తరలి వచ్చారు.


- శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం
ఉత్తనూరు గ్రామం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా - తెలంగాణ
-----------------------
UTTANOORU - A VILLAGE WITH CULTURAL AND CONSTITUTIONAL VALUES

No comments:

Post a Comment