Sunday, 9 October 2022
వాల్మీకి జయంతి శుభాకాంక్షలు.
Wednesday, 5 October 2022
Happy Dussehra - Vijaya Dashami
విజయదశమి ప్రాముఖ్యత ఏంటి అనగా,
1 ) విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన రోజు అని,
2 ) పాండవులు వనవాసం వెళ్ళే రోజుల్లో తమ ఆయుధాలను జమ్మి చెట్టు పై ఉంచి, తర్వాత తిరిగి తీసిన రోజుగా,
3 ) అలాగే జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.
ఓం సర్వరుపే సర్వేశే సర్వ శక్తి సమున్నతే భాయోభ్యస్తహి నో దేవి దుర్గ దేవి నమోస్తుతే.. !!
దుర్గ మాత ఆశీస్సులతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకొంటూ విజయదశమి శుభాకాంక్షలు
#uttanooru #uttanoorudhanvantarivenkateshwaraswamytemple
#ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం
#PulakurthiThirumalReddy
https://www.facebook.com/Uttanurudhanvantarivenkateshwaraswamydevasthanams
Tuesday, 8 February 2022
అంగరంగ వైభవంగా... రమణీయంగా ధన్వంతరి వేంకటేశ్వరుడి రథోత్సవం..
అంగరంగ వైభవంగా... రమణీయంగా ధన్వంతరి వేంకటేశ్వరుడి రథోత్సవం..
Friday, 4 February 2022
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం
పచ్చని తోరణాలు. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి కల్యాణం కమణీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రామంలో కొలువైన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ( ఫిబ్రవరి 04) తెల్లవారుజామున 12.45 గంటలకు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవిలకు మాంగళ్యధారణ చేశారు.
Monday, 31 January 2022
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి అలయ చరిత్ర - UTTANOORU VILLAGE
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి అలయ చరిత్ర
అత్యత్భుతం.... ఈ ఆలయం....
అష్ట ఐశ్వర్యాలు... ఆయురారోగ్యాలు ప్రసాదించే కలియుగ వైకుంఠ దైవం
అర్జునుడి మునిమనవడు, ప్రతీక్ రాజా తనయుడు... శ్రీ జనమేజయ మహారాజు గారిచే ప్రతిష్టింపబడి... గణపతి అంశ శంభూతులు శ్రీశ్రీశ్రీ గోపాల దాసుల వారి సంకీర్తనలతో పరమపావనమైన ఆలయం.
సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడే గోపాల దాసుల వారి కీర్తనలకు పరవశించి... నాట్యం ఆడిన ప్రాంతం ఈ ఆలయం...
ఆలయ చరిత్ర గురించి మరిన్ని వివరాలకు ఆ వీడియో లో వీక్షించాలని మనసారా కోరుతున్నాం
--- శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం ---
ఉత్తనూరు గ్రామం, అయిజ మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా
Uttanooru - A Village with Cultural and Constitutional Values
fb link : https://fb.watch/aRFxGGDZxS/
Tuesday, 25 January 2022
శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
ఓం నమో వేంకటేశాయ....
Friday, 14 January 2022
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం, శ్రీవారు ఉత్తరద్వారం
వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తనూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయానికి తరిలివచ్చిన భక్తులు... ఈ పర్వదిన సందర్భంగా శ్రీవారు ఉత్తరద్వారం గుండ భక్తులకు దర్శనమిచ్చారు......
Tuesday, 11 January 2022
అందరు ఆహ్వానితులే....
అందరు ఆహ్వానితులే....
Sunday, 9 January 2022
Friday, 7 January 2022
ఉత్తర ద్వార దర్శనం & శ్రీదేవి భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం - LIVE TELECAST
కరోనావైరస్ ప్రభావం వల్ల శ్రీవారి కళ్యాణ మహోత్సవం చూడలేని వారికోసం సోషల్ మీడియా లో లైవ్ టెలికాస్ట్ చేయలని దేవస్థాన కమిటీ నిర్ణయం తిసుకుంది
Wednesday, 5 January 2022
ఉత్తర ద్వార దర్శన మహత్యం
ఉత్తర ద్వార దర్శన భాగ్యం -- సకల పాప హరణం
ఉత్తర ద్వార, వైకుంఠ ఏకాదశి వైభవం:
కృతయుగం మురాసురుడు అనే రాక్షసుడు, మానవులను, దేవతలను సర్వవిధబాధలను పెడుతున్న సమయంలో దేవతలంతా కలసి శ్రీమన్నారాయణుని ప్రార్థించగా ఆయన ఒక సంకల్పబలంతో జపం చేయుచుండగా వివిధ వర్ణాలతో కూడిన ఏకాదశి శక్తులతో ఒక అమ్మవారి రూపం ఉద్భవించి రాక్షసుడైన మురాసురుడుని సంహరించి అందరినీ రక్షిస్తుంది. కనుక అప్పటి నుండి ఆమెకు ఇచ్చిన వరప్రసాదం చేత ప్రతి ఏకాదశినాడు ఉపవాస దీక్షలతో మిమ్ములను (శ్రీవారిని పూజిస్తే, సర్వశుభాలు చేకూరతాయి అని సెలవిచ్చిందట. ఆనాటి నుంచి దేవతలంత సంతోషించి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర వైకుంఠ ద్వారం గుండా సమస్త 33 కోట్ల దేవతలందరు దర్శిస్తారని పురాణం
Sunday, 2 January 2022
ఓం నమో వేంకటేశాయ....
-
శ్రీదేవి, భూదేవి సమేత ధన్వంతరి వేంకటేశ్వర స్వామి కల్యాణం అయిజ మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకుని శ...
-
ఉత్తనూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ధన్వంతరి జయంతి సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది . ఉదయం సుప్రభాతస...












